మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సేవలు అభినందనీయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, SCSC చైర్మన్ వీసీ సజ్జనార్ అన్నారు. శనివారం మాదాపూర్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో SCSC వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పలువురు SCSC ప్రతినిధులు, సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పలువురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా SCSC అద్భుతమైన సేవలు అందిస్తుందని కొనియాడారు. సీ సేఫ్ యాప్, సంఘ మిత్ర ఫర్ కమ్యూనిటీస్, సేఫ్ – సేఫ్టీ అవేర్‌నెన్ ఫర్ ఎంప్లాయీస్, కాన్‌క్లేవ్‌లు, హ్యాకథాన్‌లు, వాకథాన్‌లు, షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లు నిర్వహిస్తూ ప్రజల్లో అనేక అంశాల పట్ల చైతన్యం కల్పిస్తుందని అన్నారు. ఇలాగే SCSC సేవలు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో SCSC ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, సుచేత్ దేవులూరి, శ్రీకాంత్ బడిగ, డాక్టర్ రాజీవ్ మీనన్, మనీష్ దయా, శ్రీశా భార్గవ, హైసియా ప్రెసిడెంట్ భరణి అరోల్, ట్రాఫిక్ డీసీపీ, ట్రాఫిక్ ఫోరం కన్వీనర్ విజయ్ కుమార్, సైబరాబాద్ వుమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజ, ఆర్‌కేఎస్‌సీ వైస్ చైర్మన్ దాస్ గునలన్, SCSC సంయుక్త కార్యదర్శులు ప్రత్యూష శర్మ, వెంకట్ టంకశాల, దినకర్ వెంకట, SCSC కోశాధికారి ప్రవీణ్ పోలవరం, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రమోషన్స్ సీఈవో విజయ్ రంగినేని, ఐటీఈ అండ్ సీ సీఆర్‌వో అమర్‌నాథ్ ఆత్మకూరి, టెక్ మహీంద్రా సెంటర్ హెడ్ వినయ్ అగర్వాల్, టీటీఈసీ సెంటర్ హెడ్ రఘు రాజారాం, ఈసీ మెంబర్లు పీయూష్ అగర్వాల్, సాలపురియా సత్వ, మదన్‌మోహన్, జ్యోత్స్న అంగారా, చంద్ర కమ్ముల, రమేష్ గోపిగిరి తదితరులు పాల్గొన్నారు.