శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ (ఏ ఐ ఎఫ్ డి ఎస్) రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను మియాపూర్ ఎంఏ నగర్ ఆఫీసులో 2వ రోజు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ఉపాధ్యాయుడిగా ఏఐఎఫ్ డిఎస్ జాతీయ నిర్మాణ బాధ్యుడు మద్దికాయల అశోక్ ఓంకార్ హాజరై మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి వ్యక్తిగత వాదమైన మనువాదాన్నీ, విద్య కషాయికారణ అనే ఎజెండాలను అమలు చేసే దిశగా బలంగా పూనుకుంది కావున బిజెపి మనువాద మత చాందస భావాలను వ్యతిరేకిస్తూ శాస్త్ర విద్యా విధానం కావాలని అన్నారు. ప్రవేట్ యూనివర్సిటీల బిల్లులకు వ్యతిరేకంగా, ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలను రద్దుచేసి కామన్ స్కూల్ విద్యా విధానంపై అనేక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడడానికి సరైన విధానం తీసుకురాకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని ఆకస్మిక ఆలోచన, అనాలోచిత చర్యలు చేపడుతుందన్నారు.
ఈ శిక్ష తరగతులకు ప్రిన్సిపాల్ గా ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున బాధ్యతలు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏ ఐ ఫ్ డి ఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మలోతు జబ్బర్ నాయక్, జాతీయ కమిటీ సభ్యుడు డక్క కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు టెంకటి కుమార్, గడ్డం శ్రీకాంత్, హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మార్త నాగరాజు, పోలబోయిన రాజు, సాయిరాం రెడ్డి, కీర్తన, వేణు తదితరులు పాల్గొన్నారు.