శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పేద విద్యార్థిని, విద్యార్థులకు కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చలసాని వెంకటేశ్వర్ రావు, అధ్యక్షుడు అరెకపూడి గాంధీ చేతులమీదుగా ఆమీర్ పేట రాష్ట్ర కార్యాలయంలో ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రతీ ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇకముందు రాష్టంలో ఉన్న ప్రతి సంఘం నుండి ఐదుగురిని ఆర్థికంగా ఆదుకుని ప్రోత్సహించే విధంగా స్థానిక సంఘాలు భాద్యత తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న గ్రామీణ సంఘాల బలోపేతానికి రాష్ట్ర సంఘం చేయూతనిస్తుందని, హైదరాబాద్ లో గత ప్రభుత్వం ఇచ్చిన స్థల వివాదానికి కూడా త్వరలోనే ఒక పరిష్కారం రానున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అడుసుమిల్లి వెంకటేశ్వర రావు, కోశాధికారి డా. పునుకొల్లు నాగభూషణం, ఉపాధ్యక్షులు పల్లెంపాటి శివన్నారాయణ, తాళ్లూరు చంద్రమౌలి, సంయుక్త కార్యదర్శి పాతూరి వెంకట రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పినపాక ప్రభాకర్ , తాళ్ళూరి జీవన్ కుమార్, కమిటీ సభ్యులు కాజా కళ్యాణ చక్రవర్తి, చాపరాల శ్రీనివాస దాస్, కంకణాల శివాజీ, ముప్పనేని అప్పారావు, పలు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు గ్రామీణ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.





