శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జిహెచ్ఎంసీ ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు కే కేశవ రావు జన్మదినం సందర్బంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






