అఖిలేష్ యాదవ్‌ను క‌లిసిన బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆ సంద‌ర్భంగా రామచంద్ర యాద‌వ్ మాట్లాడుతూ తెలంగాణ‌లో బీసీ ముఖ్య‌మంత్రి వ‌చ్చేందుకు అఖిలేష్ యాద‌వ్ కృషి చేస్తాన‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. తెలంగాణ‌లో బీసీలు చేస్తున్న 42 శాతం రిజ‌ర్వేష‌న్ పోరాటానికి అఖిలేష్ యాద‌వ్ మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు. దేశ‌వ్యాప్తంగా బీసీలు ఏక‌మై రాజ్యాధికారం సాధిస్తేనే బీసీల‌కు త‌గిన న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ మెంబర్ మందాడి అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జాతీయ సెక్రెటరీ రమేష్ యాదవ్, చింతల రవీందర్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీసీ యూత్ అధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, పాములేటి యాదవ్, కార్యదర్శి హరికృష్ణ చారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here