శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. మియాపూర్ ఆల్విన్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ , లింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బీసీ కన్వీనర్ ఒంగోరు శ్రీనివాస్ యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ను స్మరించుకుంటూ గొప్ప వ్యక్తిత్వం గల సామాజిక స్పృహ కలిగిన మహిళ అని అన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలని, ఆమె చేసిన సేవలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ కాలంలో మహిళలకు విద్య లేని సమయంలో కూడా బాలికల పాఠశాలను స్థాపించి మహిళలకు బాలికలకు విద్య అందించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్వీనర్ ఒంగోలు శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ , సీనియర్ జర్నలిస్ట్ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షులు తిరుపతి, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ సత్యనారాయణ యాదవ్, గోపాల్ యాదవ్ చారి, కార్యకర్తలు పాల్గొన్నారు.