అల‌రించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శిల్పారామం లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఎస్ వి జి కళావర్షిణి మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ గురువు సంధ్య రాణి కోసూరు శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. లిఖిత, హవీష్, కౌటిల్య వేణువు పై కమల్, బాలకృష్ణ, వరవీనా, కాలభైరవాష్టకం , శాన్వి, నిర్విజ్ఞా కీబోర్డ్ పై లింగాష్టకం, శ్రీ రామ శ్రీ రామ, తేజస్వి వయోలిన్ పై అచ్యుతం వందేమాతరం మొదలైన పాటలు పలికించారు. గాత్ర కచేరి లో సరళీస్వరాలు, అంబుజా వాసిని, జంట స్వరాలూ, గణేశా, స్వరపల్లవి, స్వరజతి, గోవిందాశ్రిత, అన్నమయ్య కీర్తనలు, మొదలైనవి హంసిని, జాహ్నవి, ఆర్నవి, హనుశ్రీ, యువన్, మాన్విత మొదలైన వారు ఆలపించారు. భరతనాట్య ప్రదర్శనలో గణపతి పాలయమాం, గణేషకౌతం, వీణ పుస్తక దారిని, రామ రామ, శ్రీ విజ్ఞారాజం భజే, దశావతారం అంశాలను నిర్విజ్ఞా, ఖుషి, మనస్విని, హంసిక, సమన్విత, మిధున, శ్రీనిక, రుత్విక, తరుణీ, ఆర్వీ, జోషిత, కార్తీక మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు. ముఖ్య అతిధులుగా సురభి వాణి, లక్ష్మి ఐఏఎస్ విచ్చేసి కళాకారులకి జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు.

నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రిస్తున్న క‌ళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here