సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: వనం సుధాకర్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నగరంలోని రవీంద్రభారతిలో సీపీఎం సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తదితరులు హాజరయ్యారు. సంస్మరణ సభలో MCPI(U) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ పాల్గొని మాట్లాడారు. సారంపల్లి మల్లారెడ్డి ప్రజా, కార్మిక ఉద్యమాల్లో అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, సారంపల్లి మల్లారెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here