పర్యావరణ పరిరక్షణకు విత్తన గణపతి పంపిణీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లో పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా విత్తన గణపతిని పంపిణీ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకొచ్చిన విత్తన గణపతిని చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాఘవేందర్ యాదవ్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో విత్తన గణపతిని వినియోగించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here