శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి, రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించిన కానిస్టేబుల్ చదువు యాదయ్యని భగవాన్ స్వచ్చంద సేవా సంస్థ అధినేత భగవాన్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ లో ఓ కార్యక్రమంలో సన్మానించారు. ఈ సన్మానం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని కానిస్టేబుల్ యాదయ్యని ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చదువు యాదయ్య హెడ్ కానిస్టేబుల్ గా విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించడం గొప్ప విషయం అని అన్నారు.
ఎంతో మందికి స్ఫూర్తిప్రధాత గా నిలిచారు అని, ఆయన సేవలు అమోఘం అని కొనియాడారు. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించడం ఎంతో మంది కోరిక అని, యాదయ్య విధి నిర్వహణలో నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసి విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి పతకం పొందడం గొప్ప విజయంగా భావిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ స్వచ్ఛంద సేవా సంస్థ భగవాన్, సర్ప రావు నాయుడు, ప్రసాద్, పరసపరమేశ్వర్ రావు, మిరియాల రాఘవరావు, అరవ రామకృష్ణ, చందు శ్రీనివాసరావు, ఏవీ రత్నం, పార్థసారథి, డాక్టర్ కోళ్ల వెంకటేశ్వరరావు, సీతారామయ్య, లోథా ఆనందరావు, డీవీ నాగేశ్వరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.