మాదాపూర్, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పారామం మాదాపూర్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా ఆదివారం ప్రవీణ వాడపల్లి శిష్య బృందం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
గణేశా పంచరత్న, పుష్పాంజలి, అలరిపు, జతిస్వరం, కౌత్వం, వర్ణం, శ్లోకాలు, రాజరాజేశ్వరీ అష్టకం, నారాయణ హరి, విషమకర ఖన్నన్, తిల్లాన మొదలైన అంశాలను ఆధ్య, శశి, సియా, శ్రీ శాన్వి, ప్రియా వర్షిణి, ఆశ్రిత, అహనా, ప్రకృతి, కాశ్వీ, రజిని తదితర కళాకారులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.