సరస్వతి విద్యా మందిర్‌లో సంక్రాంతి సంబరాలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రతిబింబించాయి. ముగ్గుల పోటీలకు జడ్జిలుగా ఝాన్సీ, కనకదుర్గ , పద్మ , నాగేంద్రమ్మ, హెచ్‌ఎం అరుణ వ్యవహరించారు. విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలకవర్గ సభ్యులు పాల్గొని విద్యార్థులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here