శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీ బి బ్లాక్ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్ కాలనీ బి బ్లాక్ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని, మంజీర తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వాసులు అనిల్ రెడ్డి, యాదవ రెడ్డి, మహేష్, శరత్ కుమార్, గోపాల్, సందీప్, వికాస్, సాయి రెడ్డి, పరమేశ్, రాములు, ఆది నారాయణ, రాము, కిరణ్, శ్రీనివాస్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.






