శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని హఫీజ్‌పేట డివిజన్‌లో పారిశుద్ధ్యం పడకేసిందని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. గత నెల రోజుల కిందట ప్రజా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు భారీ ఎత్తున శానిటరీ డ్రైవ్ అని 15 రోజుల పాటు వాడవాడలా తిరిగి హడావిడి చేశారని, కానీ ప్రస్తుతం చూస్తే ఎక్కడ చెత్త అక్కడే ఉందని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో చెత్త ఇలా పేరుకుపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోగాలు వచ్చి హాస్పిటళ్లలో చేరి అవస్థలు పడుతున్నారని అన్నారు. వెంటనే సర్కిల్ డీసీ, డాక్టర్ రవి, ఇతర సంబంధిత అధికారులు ఈ సమస్యపై స్పందించి చర్యలు చేపట్టాలని, ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కోరారు.






