బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మావేశానికి స‌న్నాహ‌క కార్య‌క్ర‌మం

శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఈ నెల 24వ తేదీన‌ ఆదివారం మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అధ్యక్షతన జరగనున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి సన్నాహకంగా గురువారం ఖాజాగూడ లోని గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సమావేశం కోసం చర్చించి సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజమ్మ, దారుగుపల్లి నరేష్, సతీష్ ముదిరాజ్, నాగపూరి అశోక్ యాదవ్, రమేష్ గౌడ్, పరమేష్, శామ్లెట్ శ్రీనివాస్, అలీం, నవాజ్, ఖాదర్ ఖాన్, మక్ బూల్, తాహెర్, బురాన్, బాలమణి, మాధవి, సుగుణ, అజీమ్, లాయక్ ఖాన్, జాకీర్, బాలరాజ్ గౌడ్, అజయ్ గౌడ్, వినోద్ కుమార్, మణి తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here