ఖమ్మం (నమస్తే శేరిలింగంపల్లి): ఖమ్మం జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా సోమ అశోక్ ఎన్నికయ్యారు. ఆదివారం ఖమ్మం నగరంలోని అల్లిపురం రోడ్డులో ఉన్న లక్ష్మీ చంద్ర గార్డెన్స్ లో రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఎన్నికల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా సోమ అశోక్ సగర, ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి సత్యం సగర, కోశాధికారిగా బైసా ఉదయ్ కుమార్ సగర, గౌరవాధ్యక్షుడిగా తాడిశెట్టి వీరేశం సగర, గౌరవ సలహాదారుడిగా నీలం వెంకటయ్య సగరలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పట్టణ అధ్యక్షుడిగా పేశెట్టి వెంకన్న…
ఖమ్మం నగరం సగర సంఘం అధ్యక్షుడిగా పేషేట్టి వెంకన్న సగర, ప్రధాన కార్యదర్శిగా బైసా విజయ్ కుమార్ సగర, కోశాధికారిగా వీరగంటి ప్రసాద్ సగర, ఉపాధ్యక్షులుగా దుంపల కుమారస్వామి సగర, ఉపేందర్ సగరలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యధర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యధర్శి ఆంజనేయులు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిశెట్టి శంకరయ్య సగర, మాజీ జిల్లా అధ్యక్షుడు చెన్నారావు పాల్గొన్నారు.