శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల హుడా సబ్ స్టేషన్ 11కేవీ నల్లగండ్ల హుడా ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫీడర్ పరిధిలోని తెల్లాపూర్ చౌరస్తా, నల్లగండ్ల వాటర్ ట్యాంక్, నల్లగండ్ల హుడా కాలనీల్లో, ఎపిస్టోమ్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెల్లాపూర్ రోడ్డు, సాధన స్కూల్ వెనుక వైపు, ఎపిస్టోమ్ గ్లోబల్ స్కూల్, రాక్ పార్క్ సైడ్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు.