హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే ని నేషనల్ EWS ఫెడరేషన్ జాతీయ కో కన్వీనర్ బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, తెరాస పార్టీ స్టేట్ సెక్రెటరీ జనరల్ కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డిలు ఆదివారం కలిశారు. పలు అధికారిక సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిని వారు కలిసి ఆయనకు EWS రిజర్వేషన్లపై విన్నవించారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కల్పించిన EWS రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని వారు మంత్రిని కోరారు.