శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లోని బస్తీ దవాఖానాను స్థానిక నాయకులు బస్తీ వాసులతో కలిసి కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాధవరం రోజాదేవి మాట్లాడుతూ దవాఖానాలో ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు సక్రమంగా అందడం లేదని, ప్రజలకు అవసరమైన మందులు, ల్యాబ్ రిపోర్ట్ తీసుకురావడానికి సంబంధించిన రవాణా ఖర్చుల బిల్లు హాస్పిటల్ కి సంబంధించిన మెయింటెనెన్స్ బిల్లులు చాలా కాలంగా రావడం లేదని పేర్కొన్నారు. జీతాలు రాక బిల్లులు రాక హాస్పిటల్ స్టాఫ్ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బస్తీ దవాఖానాలను ప్రజల కోసం ప్రారంభించారు. కెసిఆర్ మీద కోపంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్లకి జీతాలు ఇవ్వక ట్రాన్స్పోర్ట్ , మైంటెనెన్సు డబ్బులు ఇవ్వక బస్తి దవఖానాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని వెంటనే డాక్టర్లకు జీతాలను ఇవ్వాలని, మెయింటెనెన్స్ డబ్బులు రవాణాకు సంబంధించిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ఆంజనేయులు, బాబు, సత్యనారాయణ, రామచందర్, ప్రవీణ్, నరసింహారెడ్డి, విద్యాసాగర్, రమేష్ రావు, శ్యామ్ రావు, సోమయ్య, వాసు, శ్రీనివాస్, రవి, మోహన్ చారి, వినోద్, వెంకటేశ్వరరావు, మాధవి రెడ్డి, విజయలక్ష్మి, రాధిక, అనురాధ, శైలజ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.





