శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): దీపావళి పండుగ సందర్భంగా వివేకానంద నగర్ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని ఆయన నివాసంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు, శివరాజు గౌడ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్..
దీపావళి పండుగ సందర్భంగా వివేకానంద నగర్ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ రెడ్డి..
దీపావళి పండుగ సందర్భంగా వివేకానంద నగర్ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిజేశారు. గురు చరణ్ దూబే తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.






