శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆర్‌టీసీ బస్సు చార్జిలను వెంటనే తగ్గించాలని మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆర్‌టీసీ బస్సు చార్జిలను పెంచినందుకు నిరసనగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు మేరకు నిర్వహించిన బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు మియాపూర్ నుంచి తరలివెళ్లేందుకు సిద్ధమైన బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ ను స్థానిక పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆ భారాన్ని పురుషుల మీద మోపాలని చూస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆర్‌టీసీ బస్సు చార్జిలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.






