మ‌త్య్స‌కారుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలి: గోరెంకల నర్సింహ్మా

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (న‌మస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి గాను జలవనరులలో, చెరువులు కుంటల్లో 100% రాయితీ పై ఉచిత చేప పిల్లల పంపిణికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపు స్పష్టంగా ప్రకటించకపోవడాన్ని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం త్రీవంగ ఖండిస్తుందని TMKMKS రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మా అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని రాయదుర్గం చెరువు వద్ద మత్స్యకారుల సంతకాల సేకరణోద్యమం నీలం సురేందర్ అధ్యక్షతన నిర్వ‌హించారు. ఈ సంతకాల సేకరణోద్యమానికి గోరెంకల నర్సింహ్మా ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మత్స్య సొసైటీ చెరువుకుంటల్లో కావాల్సినంత చేప రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడానికి సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని ఈ ఏడాది బడ్జెట్ ను సవరించి మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని, కోహెడ లో అవుటర్ రింగ్ రోడ్ ప్రక్కన గత ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందని మార్కెట్ నిర్మాణం కోసం 47 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ పనులు మాత్రం ప్రారంభించకపోడం శోచనీయం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్, రాజకీయ బడా బాబుల నుండి చెరువులు కుంటలను రక్షించాలని, మత్స్య మిత్ర మహిళా గ్రూపులను పునరుద్ధరించాలని వాటి అభివృద్ధి కోసం ప్రతి మహిళా సోసైటికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని, సహజంగా మరణించిన మత్స్యకారులకు 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TMKMKS శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వీనర్‌ నీలం సురేందర్, రాయదుర్గం ఉపాధ్యక్షుడు అంబటి అశోక్ కుమార్, కార్యదర్శి గోరెంకల శ్రీశైలం, నీరుడు శంకర్, ఇడ్ల భిక్షపతి, వీరాస్వామి, అది శ్రీశైలం, నక్కలి వెంకటేష్, ఈగ సుగుణాకర్, గోరెంకల శ్రీకాంత్, గోరెంకల సాయి కిరణ్, ఇండ్ల శ్రీరాం, నీరుడు కిరణ్, నీరుడు సాయి, మేకల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here