శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో రేగుల కుంట చెరువును, డంపింగ్ యార్డ్ ను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రేగుల కుంట చెరువు కు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేసి నేడు చెరువును పునరుద్ధరణ చేసిన శుభసందర్భంగా చెరువు లో మురుగు నీరు కలవకుండా 60 లక్షల రూపాయల తో చెరువు చుట్టూ ఇరిగేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో చేపడుతున్న మురుగు నీటి మల్లింపు UGD నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు గణేష్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.