శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, గుర్నాథమ్ చెరువు, మక్తా మహబూబ్ పేట్ లోని పెద్దకుడి చెరువు, సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ, IGUS, HDFC బ్యాంక్ ల CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని అన్నారు. చెరువుల జలకళతో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు.
చెరువు చుట్టుపక్కల కాలనీ వాసులు, ప్రజలు చెరువును సంరక్షించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా సామాజిక బాధ్యతతో సంరక్షించుకోవాలని, చెరువుల పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.