రోడ్డు మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాముళ్ళపూడి ప్రధాన రహదారిలోని ఎల్లమ్మబండ రైతు బజార్ ఎదురుగా ఉన్న‌ డంపింగ్ యార్డ్ వద్ద డామేజ్ అయిన రోడ్డు మరమ్మత్తు పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ డంపింగ్ యార్డ్ చిన్న వర్షానికి కూడా రోడ్డు మీద వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించే విధంగా రోడ్డుకు మరమ్మత్తులు చేసి వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్లేలా పనులు చేపడుతున్నామని తెలియజేశారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి, సమస్య పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, ఎ.ఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here