శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివసించే రాజమ్మ(105) అనే వృద్దురాలు మృతి చెందింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. పద్మమ్మ, నాగరాజు, సత్య రాజు, శామ్యూల్, దేవదాసు, జోషేఫ్, సతీష్ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






