అమెరికా ఆగ‌డాల‌ను ఇక‌నైనా ఆపాలి: ఏఐపీఎస్‌వో

శేరిలింగంప‌ల్లి, మే 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): Aipso రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 75 వసంతాల వార్షికోత్సవ వేడుకల‌ను శేరిలింగంపల్లి మండల పరిధిలో పిజిఆర్ స్టేడియం వద్ద నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా తిప్పర్తి మహేష్, కొంగరి కృష్ణ, చందు యాదవ్ హాజ‌రై మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపాలని కోరారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, యుద్దాల వల్ల ఎంతో మారణ హోమం, ఆస్తి నష్టం జరుగుతున్నద‌ని, ఇందుకు కారణం అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా సామ్రాజ్యవాదమేన‌ని అన్నారు. చిన్న దేశాల‌లోని చ‌మురు నిక్షేపాలను తమకు ఇవ్వాలని, లేకపోతే యుద్ధం చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నార‌ని అన్నారు. దేశాధినేతల‌ను కిడ్నాప్ చేయ‌డం, హ‌త‌మార్చ‌డం, యుద్ధాల‌కు పాల్ప‌డ‌డం వంటి చ‌ర్య‌ల‌ను అమెరికా వెంట‌నే మానుకోవాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో Aipso నాయకులు వెంకటస్వామి, శ్రీశైలం గౌడ్, ప్రశాంత్, నాగేశప్ప, భిక్షపతి గౌడ్, కాసిం, జే శ్రీనివాస్, పరమేష్, దుర్గయ్య, మధుకర్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here