డివిజన్ల పునర్విభజనపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ మసీదు బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ ఇంచార్జ్ ఆలే భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ సమక్షంలో నియోజకవర్గం స్థాయి ముఖ్య నాయకుల‌ సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో కంటే నూతనంగా పెరిగిన డివిజన్లలో సరిహద్దులు, ఒడిదుడుకులను గుర్తించి జిహెచ్ఎంసి కార్యాలయానికి నియోజకవర్గం తరఫున ఫిర్యాదులు అందజేయాలని కోరుతూ, పెరిగిన డివిజన్ల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో నిలవాలని సూచిస్తూ, చాలామంది నాయకులకు పోటీ చేసే అవకాశం, ప్రజా సేవ చేసే సమయం ఆసన్నమైంది క‌నుక ఇప్ప‌టి నుంచే పోటీలో నిలిచేవారు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని నాయకులు తెలిపారు.

అంతేకాకుండా నియోజకవర్గంలో కొత్త ఓటర్లపై దృష్టి, బోగ‌స్ ఓట్లను తొలగించడం, పార్టీ పరమైన కమిటీలను వేగవంతం చేసి శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రవికుమార్ యాదవ్ సభను ఉద్దేశించి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, బాల్ద అశోక్, రాఘవేంద్రరావు, నాగుల గౌడ్, బుచ్చిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, కేశవులు, రామరాజు, రాధాకృష్ణ యాదవ్, అనిల్ గౌడ్, మాణిక్ రావు , కృష్ణంరాజు , దుర్గాప్రసాద్, స్రవంతి, పద్మ, నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here