శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాస రావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ,మాజీ కౌన్సిలర్లు , నాయకులు ,కార్యకర్తలు,మహిళలు,కాలనీల వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
చందానగర్‌లో..
చందానగర్ నగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో 76వ భారత గణతంత్ర దినోత్సవము సందర్బంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ,మాజీ కౌన్సిలర్లు , నాయకులు ,కార్యకర్తలు,మహిళలు,కాలనీల వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.