శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): 76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్, రాజా రాజేశ్వరి నగర్, హనీఫ్ కాలనీ, మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్, సఫారీ నగర్, అంజయ్య నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, న్యూ పీజేఆర్ నగర్ కాలనీలలో స్థానిక నాయకులు, ప్రజలతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం గావించారు.