శేరిలింగంపల్లి, జనవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బాలాజీ నగర్ సెక్షన్ ఆఫీసులో ఘనంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ భీమ్ లింగప్ప, ఫోర్ మెన్ వెంకటేశ్వర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు యాదయ్య, నర్సింహులు, రవి నాయక్, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.






