మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ 48 కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి వెల్లివిరిసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) డిప్యూటీ కమిషనర్ డి.శ‌శిరేఖ‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, కార్యాలయ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here