శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మెడికవర్ హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో HPB-ఆంకో ఎక్సలెన్స్ సిమ్పోజియంని విజయవంతంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో 400కు పైగా వైద్య నిపుణులు, ప్రత్యేకజ్ఞులు పాల్గొని కాలేయం, క్లోమగ్రంథి, పిత్త మార్గాల క్యాన్సర్ల నిర్ధారణ, చికిత్సల్లోని తాజా పురోగతులపై చర్చించారు. సర్జికల్, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వంటి బహుళశాఖల నుండి ప్రముఖ వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డా. రవి చంద్ర వెలిగేటి, డా. సరితా శ్రీవస్తవ్, డా. అమిత్ జోత్వానీ, డా. అరుణ్ అరోరా తమ విశిష్టమైన అనుభవాలను పంచుకున్నారు.
సదస్సులో హెపటోసెల్యులర్ కార్సినోమా, పిత్త మార్గాల క్యాన్సర్లు, క్లోమగ్రంథి క్యాన్సర్ వంటి సంక్లిష్ట రోగాలపై ఆధునిక చికిత్సా పద్ధతులు, కేస్ స్టడీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు, వ్యక్తిగతీకరించిన చికిత్సా విధానాలు గురించి సవివరంగా చర్చించబడ్డాయి.ఈ క్యాన్సర్లపై కొత్త చికిత్సా విధానాలు, AI ఆధారిత డయాగ్నస్టిక్స్, పర్సనలైజ్డ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి అంశాలపై చర్చ జరిగింది. క్లినికల్ కేస్ డిస్కషన్లు, ప్యానెల్ డిబేట్స్, ప్రాక్టికల్ సెషన్ల ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచే అవకాశాన్ని ఈ సదస్సు అందించింది. పాల్గొన్న ప్రతినిధులకు రెండు TGMC క్రెడిట్ పాయింట్లు కూడా ప్రదానం చేయబడ్డాయి.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. ఏ. శరత్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సదస్సులు వివిధ వైద్య శాఖల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప వేదిక. తాజా పరిశోధనలు, అనుభవాలను పంచుకోవడం ద్వారా రోగులకు మరింత సమగ్రమైన, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించగలుగుతాము అని వివరించారు.