హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. సోమవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో కార్డ్ (సీఏఆర్‌డీ) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరగనున్నాయి. కాగా ఇప్పటికే ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్‌ను నిలిపివేశారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారికి కూడా ఎప్పటిలాగే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.