సికింద్రాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సికింద్రాబాద్ లోని వెస్లీ జూనియర్, డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఎన్‌సీసీ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో సెలక్షన్లు నిర్వహించనున్నట్లు ఏఎన్‌వో లెఫ్టినెంట్ పి. సుధీర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్లకు వచ్చే వారు ఇంటర్, డిగ్రీ చదివిన వారైతే 4 సెట్ల ఆధార్ కార్డ్, ఎస్ఎస్సీ మెమో, పిల్లలది కానీ లేదా తల్లిదండ్రులది కానీ బ్యాంకు పాస్ బుక్ జిరాక్సులు, 4 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, ప్రస్తుతం చదువుతున్న వారైతే ఒక సెట్ బోనఫైడ్ సర్టిఫికెట్ లతో హాజరు కావాలని తెలిపారు. 1600 మీటర్ల రన్నింగ్ పోటీ ఉంటుందని, అందుకు ప్రిపేర్ అయి రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7095611017 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.