మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీలో నాయకులు, స్థానికులతో కలిసి ఆయన పర్యటించారు. పెండింగులో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించేలా చూస్తామని తెలిపారు. అనంతరం సుభాష్ చంద్ర బోస్ నగర్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.



ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఆదిత్య నగర్ బి బ్లాక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శంకర్ రావు, సుభాష్ చంద్ర బోస్ నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముఖ్తర్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ నాయకులు బాబూమియా, రెహ్మాన్, బస్తీ నాయకులు సత్యనారాయణ, రామకృష్ణ, అజీమ్, అమీర్, ఆదిత్య నగర్ యూత్ అధ్యక్షుడు ఖాజా, రాజేందర్, తానాజీ, మొగులమ్మ, శిరీష, రేణుక పాల్గొన్నారు.