శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ యువనేత రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలిసిన రవీందర్ యాదవ్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో భారాస నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను మద్ధతు కోరారు. రవీందర్ యాదవ్ కు వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. తాను ఉన్నాను అని భరోసా కల్పించారు. ఇటీవల జన్మదినం సందర్భంగా రవీందర్ యాదవ్ కు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






