శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): సదాశివపేట 21వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందిన ఎం.డి. వాజిద్ ని హఫీజ్‌పేటలో రవీందర్ సాగర్ కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎం.డి. వాజిద్ విజయం సదాశివపేట పట్టణ అభివృద్ధికి నూతన దిశానిర్దేశం అవుతుందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శకంగా, నిబద్ధతతో ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆయన విజయం ప్రజా సేవకు శ్రీకారం కావాలని, ప్రతి అడుగులోనూ ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.






