శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్ ఇండియా ఐఎన్టియుసి నాయకుడు డాక్టర్ జి సంజీవరెడ్డి 96వ జన్మదినం పురస్కరించుకొని 33/11 కె.వి లోధా సబ్ స్టేషన్ ఆవరణలో పునాస మామిడి, చామంతి పూల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్, 327 ఐఎన్టియుసి సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కే. వెంకటేశ్వర్లు, కొండాపూర్ డివిజన్ సెక్రటరీ రాజేందర్ నాయక్, వెంకటేష్ గౌడ్, మల్లేష్, కుమార్ పాల్గొన్నారు.






