శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అలంకరణలు, ఏర్పాట్లు, నిర్వహణపై రవి యాదవ్ స్వయంగా పరిశీలన చేసి తలసాని సాయితో కలిసి మేనేజ్‌మెంట్ టీమ్‌తో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ, ప్రజా సంక్షేమం కోసం కృషి కొనసాగించాలని ఈ సందర్భంగా రవి యాదవ్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.






