మాస్ట‌ర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో స‌త్తా చాటిన రంగారెడ్డి జిల్లా

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో 900 మంది అథ్లెట్ల‌తో క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన మాస్ట‌ర్ అథ్లెటిక్స్ 12వ రాష్ట్ర పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన 60 మంది అథ్లెట్లు స‌త్తా చాటి ఓవ‌రాల్ చాంపియ‌న్ షిప్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి వ‌రుస‌గా మూడో సారి హ్యాట్రిక్ సాధించార‌ని రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు కొండా విజ‌య్ కుమార్ తెలిపారు. 20 జిల్లాలు పాల్గొన్న రాష్ట్ర స్థాయి పోటీల్లో రంగారెడ్డి జిల్లా అథ్లెట్లు మొత్తం 70 ప‌త‌కాలు సాధించార‌ని, 29 బంగారు, 23 ర‌జ‌త‌, 19 కాంస్య ప‌త‌కాల‌ను సాధించి 2వ స్థానంలో నిలిచి 2026 జ‌న‌వ‌రి చివ‌రి వారంలో జాతీయ స్థాయిలో జ‌రిగే పోటీల‌కు అర్హ‌త సాధించార‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నూనె సురేంద‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్వాతి గౌడ్ ధ‌ర్మ‌పురి తెలియ‌జేశారు. 12వ రాష్ట్ర స్థాయి మాస్ట‌ర్ అథ్లెటిక్స్ పోటీల్లో మ‌హిళా అథ్లెట్లు 40 ప‌త‌కాలు సాధించి, పాల్గొన్న మూడు ఈవెంట్లలోనూ బంగారు ప‌త‌కాలు సాధించార‌ని, వారిలో మ‌ల్లీశ్వ‌రి సుంక‌ర‌, సుశీలా రాజ్ ప‌ట్టెం, రామారావు కండ‌ర్ప‌, యేసు ర‌త్నం తుమ్మ‌ల ఉన్నార‌ని కోశాధికారి శివ‌లీలా రెడ్డి మ‌నోహ‌ర్ రెడ్డి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here