శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ఎ ఐ ఎఫ్ డి వై 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నడిగడ్డ తాండ సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్, ఎంఏ నగర్ నగర్లో యువజన సంఘ జెండాలను ఎగురవేశారు. డిసెంబర్ 25 నుండి 31 వరకు అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య( ఏ ఐ ఎఫ్ డి వై ) 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ భృతి, ఉపాధి కల్పన అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఏఐఎఫ్డి వై సంఘం నాయకులు మాట్లాడుతూ మన దేశంలోని యువత ఐక్యంగా పోరాడవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించడం, నవ ఉదారవాదం రెండు ప్రాథమిక ఆదేశాలని, ఇవి మన దేశంలో ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి మధుసూదన్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, యం డి సుల్తాన బేగం, డి శ్రీనివాస్, రంగా స్వామి, డి నరసింహ, జి శివాని, ఎండి రజియా బేగం, టీ అనిల్ కుమార్, పుష్ప, యం నర్సింహా తదితరులు పాల్గొన్నారు.






