డోయిన్స్ టౌన్షిప్ లో రంజాన్ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని డోయిన్స్ టౌన్షిప్ లో రంజాన్ పండుగను పురస్కరించుకొని కొండపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా ఆయ‌న‌ స్వగృహంకు వెళ్లి రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన్ని శాంతి, పరస్పర సహకారం, ఐక్యమత్యంతో జరుపుకోవాలని అన్నారు. ఆ అల్లా అనుగ్రహంతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మల్లేష్ గౌడ్, శ్రీశైలం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here