శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): ఈద్గా అభివృద్ధి బాధ్యత తమదే అని, మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. రంజాన్ సందర్భంగా మైనారిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాలు, మతాల పండగలు గొప్పగా జరుగుతున్నాయన్ని, మైనారిటీ ప్రజలు ప్రభుత్వానికి నిరంతరం అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హమీద్ సహబ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్, శివ గౌడ్, వెంకట్ రెడ్డి, రాంబాబు, బాబ్జి, ఆనంద్, మైనారిటీ నాయకులు మునఫ్ ఖాన్, ఖాజా, హనీఫ్, ఇస్మాయిల్, హమీద్, లతీఫ్, సాహెల్, ఇమ్రాన్, హామీద, రీజ్వన్, ముష్రాఫ్,షేక్ చంద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.