శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ -21 కి చెందిన ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఎర్లీ బర్డ్ స్కీమ్‌ను వినియోగించుకోవాలని, మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ఏప్రిల్ 30 కంటే ముందు చెల్లించిన అసెస్‌మెంట్‌కు సంబంధించి ఆస్తి పన్నులో ఐదు శాతం రాయితీ ఇవ్వబడుతుందని ఉప కమీషనర్ పి. మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆస్తి పన్నులను చందానగర్ సర్కిల్ ఆఫీస్ లొని సిటిజన్ సర్వీస్ సెంటర్, బిల్ కలెక్టర్లు, మీ-సేవా, ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా ఎర్లీ బర్డ్ ఆఫర్‌ను పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందాలని చందానగర్ ప్రజలకు సూచించారు.