శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ సీనియర్ నాయకుడు రాజు శెట్టి కురుమ తన జన్మదినాన్ని సామాజిక సేవతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సురభి కాలనీ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి విద్యా ప్రాధాన్యతను వివరించారు. తరువాత ఆయన జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో భోజనం చేసి సమాజ శుభ్రత కోసం వారు చేస్తున్న కష్టసాధ్యమైన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక పరిసరాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని రాజు శెట్టి కురుమ పేర్కొన్నారు. వారి సేవలను గౌరవిస్తూ వారికి పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు భిమాని కిశోర్, ఉపాధ్యక్షురాలు కౌసల్య, కార్యదర్శి సిద్దు, బాలరాజు, శ్రీకాంత్, మీనా, లక్ష్మి, భార్గవ్, కల్యాణ్, రాణి, మల్లేశ్, సతీశ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొని రాజు శెట్టి కురుమకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






