శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద స్థానిక ట్రాఫిక్ పోలీసులు కొండాపూర్ ఎంవీఐ అధికారులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొండాపూర్ ఎంవీఐ, ఏఎంవీఐ మనోజ్, ఆర్‌టీఏ సిబ్బందితో కలిసి మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్, ట్రాఫిక్ పోలీసులు ఆటో రిక్షాలను తనిఖీ చేశారు. పర్మిట్లు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఔటాఫ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్లు వంటి వివరాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.






