శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని యువ రాజకీయాలకు నవ మార్గదర్శిగా అభివర్ణించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్‌లో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయకుడు రవి కుమార్ నాయీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి అనేక కీలక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, టెలికాం, ఐటీ రంగాలకు పునాదులు వేయడం, కంప్యూటరైజేషన్‌ను ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చాయని అన్నారు. మహిళా సాధికారత, సమ్మిళిత విద్యా విధానం, సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమాలకు రాజీవ్ గాంధీ ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అలీ, బాష్పాక యాదగిరి, నగేష్ నాయక్, నాగేశ్వర్ రావు, శేఖర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, ప్రభాకర్ రెడ్డి, కనకమామిడి నరేందర్ గౌడ్, రాములు గౌడ్, నర్సింహ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, మిరియాల ప్రీతం, రాజేష్, శివ కుమార్, విష్ణు, పద్మరావు, సౌందర్య రాజన్, నర్సింగ్ రావు, వెంకట్ రెడ్డి, సాదిక్, జావేద్, రామచందర్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, గోపాల్ నాయక్, శంకర్ గౌడ్, చిన్న, కార్తీక్ గౌడ్, రిజ్వాన్, అలీతో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు అనిత, జయ, శాంత తదితరులు పాల్గొన్నారు.





