రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండకుండా చూడండి – ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న వరద, డ్రైనేజీ నీటి నిల్వ సమస్య పరిష్కారానికి అధికారులు చేపట్టిన పనులను ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వేర్వేరుగా పరిశీలించారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా అనుసరించాల్సిన విధి విధానాలపై, తీసుకోవాల్సిన చర్యల పై జరుగుతున్న పనులపై ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమిషనర్ శంకరయ్య ను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి వర్షానికి సైతం రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీరు నిలిచి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం వాటిల్లుతుందని అన్నారు.

వర్షపు నీరు నిల్వకుండా చేపట్టిన పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ

ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ పైప్ లైన్ లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించే పనులను పరిశీలించారు. ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం శ్రీమన్నారాయణ, మేనేజర్లు యాదయ్య, సుబ్రహ్మణ్యం, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు కృష్ణ యాదవ్, కొండల్ రెడ్డి, వేణు గోపాల రెడ్డి, రమేష్, నటరాజు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, రామ్ చందర్, వార్డు మెంబర్ కవిత, కొండల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చేపట్టిన పనులను పరిశీలిస్తున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here