నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. టీన్జీఓ కాలనీలో రూ. కోటి 20 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, గోపన్ పల్లి లోని గోసాయి కుంట చెరువు అభివృద్ధి కోసం రూ. కోటి 78 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, గోసాయి కుంట చెరువు అభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్ట పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాలువ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ నళిని, ఏఈలు పావని, మహేందర్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, టీఎన్జీఓ కాలనీ వాసులు కృష్ణా రెడ్డి, సాయిరెడ్డి, సుధాకర్, హన్మానాయక్, సంజీవ్ రావు, కృష్ణ మూర్తి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, శ్రీను పటేల్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, సురేందర్, జంగయ్య యాదవ్, అంజమ్మ, రాజు ముదిరాజ్, యాదగిరి, నరేందర్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, సల్లావుద్దీన్, అనిల్ సింగ్, నారాయణ, అక్బర్, మధు, గోవింద్, కృష్ణ యాదవ్, నటరాజ్, నరేష్, నగేష్, మహాదేవప్ప, కుమారి, సుగుణ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ఏరియా కమిటీ మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.